తమిళ నటుడు అజిత్ కుమార్ కొంత కాలం క్రితం విడముయార్చి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష హీరోయిన్గా నటించింది. ఇదే సినిమాలు తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ బాక్సావ్ఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా అపజయాన్ని అందుకుంది. తాజాగా అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు మార్క్ ఆంటోనీ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు.
మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల చేయగా ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి తమిళనాడు ఏరియాలో 100 కోట్ల కలెక్షన్లు కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీ బుక్ మై షో ఓ క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 2 మిలియన్ టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయినట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ కి లాంగ్ రన్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.