ఈ బ్యూటీ కి అసలు ఇంకేం పని లేదా .. వివాదాలకు కేరాఫ్ అడ్రస్..?

frame ఈ బ్యూటీ కి అసలు ఇంకేం పని లేదా .. వివాదాలకు కేరాఫ్ అడ్రస్..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పది రూపాయలు తీసుకుని వంద రూపాయలు యాక్షన్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల .. అయితే అది వెండితెరపై కాదు తన నిజ జీవితంలో ఓవరాక్షన్ చేయడం అనేది ఈ బ్యూటీకే చెల్లింది .. సందర్భం ఏదైనా సొంత డబ్బా కొట్టుకోవడం , కోరి వివాదాలు కొని తెచ్చుకోవటం ఈమెకు ఎంతో ఇష్టమైన హాబీ .. అయితే ఇప్పుడు  కూడా అదే పని చేస్తుంది ఊర్వశి రౌతేల .. తమన్నా తో తనను తాను పోల్చుకుని తననే గొప్ప అన్నట్టుగా గట్టి కల‌రింగ్‌ ఇచ్చుకుంటుంది .. రీసెంట్ గా బాలీవుడ్ లో తమన్నా నుంచి ఓ ఐటెం సాంగ్ వచ్చింది .. అయితే జాట్ అనే సినిమాలో ఊర్వశి కూడా ఐటెం సాంగ్ చేసింది .. ఈ రెండు పాటలను కంపేర్ చేస్తూ తమన్నను కించపరిచేలా పోస్ట్ పెట్టింది ఊర్వశి ..


ఇక దీంతో ఈమె పై ఊహించిన రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది .. నీకేం పని లేదు అంటూ తెగ మండిపడుతూ కామెంట్స్ వస్తున్నాయి .. ఇక దాంతో ఆ పోస్ట్ ను ఆమె వెంటనే డిలీట్ చేసింది .. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన టైంలో కూడా కియరా అద్వాని పై కూడా ఇలానే కామెంట్ చేసింది ఊర్వశి .. అలానే ఈ ఏడాది తొలి 100 కోట్ల హీరోయిన్ తానే అంటూ గతంలో గొప్పలు కూడా చెప్పుకుంది ఊర్వశి .. డాకు మహారాజ్ సినిమాతో తాను స్టార్ హీరోయిన్ అయిపోయిన అని కూడా బిల్డప్ లు కొట్టుకుంది .. చివరకు కట్ చేస్తే ఆ సినిమా బాలీవుడ్లో ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది .. అలానే మరో సందర్భంలో సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడని రియాక్షన్ ఏంటి అని జర్నలిస్ట్ అడిగితే .. ఆ సమయంలో తన చేతికి ఉన్న ఓ డైమండ్ రింగ్ , వాచీ చూపించుకుని గొప్పలు కూడా కొట్టుకుంది .. ఇక ఇప్పుడు ఏకంగా తమన్న పై పోస్టు పెట్టి సోషల్ మీడియాలో ఊహించిన విధంగా బుక్ అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: