
యువి క్రియేషన్స్ నుంచి వరుస రిలీజ్‌లు .. టాలీవుడ్ బాక్సాఫీస్ కి చుక్కలే..!
ఇక మన తెలుగు చత్ర పరిశ్రమ లో పెద్ద నిర్మాణ సంస్థల లో యువి క్రియేషన్స్ కూడా ఒకటి .. మిర్చి , సాహూ , రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు , మధ్యలో కొన్ని మిడ్ రేంజ్ చిన్న సినిమాలు చేసుకుంటూ వస్తుంది .. అయితే ఇటీవల కొంత వార్తల్లో మాత్రం ఉండటం లేదు చేతి లో సినిమాలు లేవా అంటే విశ్వంభర అలాంటి పెద్ద సినిమా ఉంది .. అలానే అనుష్క తో ఘాటి , అలాగే శర్వానంద్ , వరుణ్ తేజ్ , సంతోష్ శోభన్ , అఖిల్ ఇలా చిన్న మీడియం రెంజ్ హీరోల సినిమాలు ఎన్నో ఉన్నాయి .. కానీ ఇప్పుడు ఇవి రిలీజ్ కు లేకపోవటం తో యువి సంస్థ పేరు ఎక్కువ గా మీడియా లో వినిపించడం లేదు ..
అయితే ఇక పై నుంచి యువి నూంచి వరుస గా సినిమాలు రిలీజ్ కు రాబోతున్నాయి .. గ్రాఫిక్స్ కారణం గా లేట్ అవుతూ వస్తున్న ఘాటి విశ్వంభర సినిమాల కు త్వరలోనే రిలీజ్ డేట్ లు ప్రకటించబోతున్నారు .. ఈ రెండు సినిమా లు ఈ సమ్మర్ .. లేదా పోస్టు సమ్మర్ లో వరుస గా రాబోతున్నాయి .. ఈ సినిమాల తర్వాత శర్వానంద్ సినిమా కూడా రిలీజ్ చేస్తారు .. దాని తర్వాత సంతోష్ శోభన్ సినిమా కూడా ఉండబోతుంది ..ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న వరుణ్ తేజ్ సినిమా కూడా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోని రిలీజ్ కు ఉండే అవకాశం ఉంది .. అలానే అఖిల్ సినిమా కూడా ఇంకా మొదల కాలేదు . చేతి లో ఉన్న సినిమాల విడుదల జరగబోతే కొత్త కాంబినేషన్లు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు .. యువి అధినేతలు ..