ఒకప్పుడు బూతులు.. ఇప్పుడు పొగడ్తలు.. మెగా తలరాతని మార్చేసిన లేడీ..!

frame ఒకప్పుడు బూతులు.. ఇప్పుడు పొగడ్తలు.. మెగా తలరాతని మార్చేసిన లేడీ..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ఎప్పుడు హ్యూజ్ ట్రెండింగ్ అండ్ ట్రోలింగ్ గురి అయ్యే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ . రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా ఫ్యామిలీ మంచి చేసినా అది చెడ్డగానే చూస్తారు . చెడు చేసిన అది చెడుగానే చూస్తూ ఉంటారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా శ్రీజ లేచిపోయి పారిపోయి పెళ్లి చేసుకున్న మూమెంట్ లో.. మెగాస్టార్ ని ఏ విధంగా ట్రోల్ చేశారో చూశాం. ఆ తర్వాత మెగాస్టార్ ప్రజారాజ్యం అంటూ పార్టీ పెట్టి ఆ పార్టీని విలీనం చేశాడు ..అప్పుడు కూడా ట్రోల్ చేశారు . ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఆ తర్వాత రామ్ చరణ్ - ఉపాసన పెళ్లి చేసుకోవడం..  ఆ తర్వాత ఉపాసన ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడం.. ఒకటా రెండా ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీని ట్రోల్ చేస్తూనే వచ్చారు .

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫారిన్ అమ్మాయి అన్నాలెజినోవా ను పెళ్లి చేసుకున్న మూమెంట్ లో దారుణాతి దారుణంగా మెగా ఫ్యామిలీ పై కామెంట్స్ పెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అయ్యే అన్న లేజీనోవాన ఇప్పుడు మెగా ఫ్యామిలీ తలరాతన మార్చిన సూపర్ లేడీగా మారిపోయింది . మెగా ఫ్యామిలీ లేడీస్ ఇప్పటివరకు ఎవరు కూడా తిరుమల వెళ్లి ఇలా గుండు ఇచ్చిన దాఖలాలు లేవు . అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా మాత్రం తన కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అంటూ తలనీలాలు సమర్పించడమే కాకుండా ఏకంగా 17 లక్షలు అన్నదానానికి డొనేట్ చేసింది.

దీనితో సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ భార్య పేరు మారు మ్రోగిపోతుంది. స్టార్ సెలబ్రిటీ హోదాలో తలనీలాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా  గ్రేట్. నిజానికి పవన్ కళ్యాణ్ నే గుండు ఇవ్వాలి అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కారణంగా గుండు ఇవ్వలేని మూమెంట్లో పండితుల సలహాతో భర్తలో సగ భాగమైన భార్య ఆ మొక్కును చెల్లించే విధంగా అన్నాలెజీనోవా తలనీలాలను సమర్పించిందట . ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి అందరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం అన్నాలెజినోవా నే అంటున్నారు జనాలు . ఒకప్పుడు అన్నాలెజినోవాను బూతులు తిట్టిన జనాలు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: