టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం మంచి స్థాయికి చేరుకున్న నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన చిన్న కమెడియన్ మొదలు పెట్టి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తూ హీరో గా కూడా మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ప్రియదర్శి ఇప్పటి వరకు హీరో గా నటించిన సినిమాలలో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన కోర్టు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న ప్రియదర్శి తాజాగా సారంగపాణి జాతకం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వెన్నెల కిషోర్ , వైవా హర్ష ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ ని మొదట ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన కాకుండా ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ను ఈ రోజు అనగా ఏప్రిల్ 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.