విజయ్ సేతుపతి కోసం మరో బ్యూటీని రంగంలోకి దించనున్న పూరి జగన్నాథ్..?

frame విజయ్ సేతుపతి కోసం మరో బ్యూటీని రంగంలోకి దించనున్న పూరి జగన్నాథ్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరుస పెట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటు చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇక అలా స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకొని ఎంతో కాలం పాటు అలాగే కెరియర్ను కొనసాగించిన పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు.


ఈయన ఆఖరుగా ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన లైగర్ , డబల్ ఇస్మార్ట్ మూవీలు భారీ పరాజయాలను ఎదుర్కొన్నాయి. ఇకపోతే పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతితో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడింది. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ టబు నటించబోతుంది. ఇక టబు ఈ సినిమాలో నటించబోతుంది అని వార్తల రావడంతో ఈమె ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు.


కానీ టబు ఈ మూవీ లో హీరోయిన్ పాత్రలో కాకుండా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో విజయ్ సేతుపతికి జోడిగా మరో క్రేజీ బ్యూటీని తీసుకుని ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో విజయ్ సేతుపతి కి జోడిగా రాధిక ఆప్టేను తీసుకొనే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: