
అమరావతిలో భూమిని కొనుగోలు చేసిన నందమూరి బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?
విజయవాడ గుంటూరు అమరావతిలతో కలిపి మెగా సిటీని నిర్మించేలా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. భూ సమీకరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న చోట బాలయ్య, వసుంధర భూములను కొనుగోలు చేశారని తెలుస్తోంది. గత నెలలో ఇందుకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని భోగట్టా. మొత్తం 200 ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
45 లక్షల రూపాయల చొప్పున 200 ఎకరాలు కొనుగోలు చేశారని వార్తలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇందుకు సంబంధించి మధ్యవర్తిత్వంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య భూమి కొనుగోలు చేసిన చోట భూ సమీకరణ జరుగుతుందా లేదా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. వైరల్ వార్తలు నిజమైతే మాత్రం ఈ భూ సమీకరణ హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది.
మరోవైపు బాలయ్య తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాలు ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది. స్టార్ హీరో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య పారితోషికం గురించి సైతం ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య భారీ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు సైతం వెలువడనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.