టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఈ మూవీ కి విడుదల అయిన 24 గంటల్లో అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో 21.36 మిలియన్ వ్యూస్ దక్కగా ... 422.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది.
ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారానే ఈ మూవీ లో భారీ రక్త పాతం ఉండబోతున్నట్లు అర్థం అయింది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ రావడంతో ఈ మూవీ లో అత్యంత భారీ రక్తపాతం ఉండబోతున్నట్లు క్లియర్ గా తెలిసిపోయింది. మరి ఇలా భారీ రక్త పాతం కలిగిన సినిమా ద్వారా నాని కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.