కొంతమంది హీరోలు కొన్ని సినిమాలను మిస్ చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు.కానీ కొంతమంది హీరోల దగ్గరికి వచ్చిన కథలు చేద్దాం అనుకునేసరికి మరో హీరోల చేతిలోకి వెళ్ళిపోతాయి. అలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు చేతిదాకా వచ్చినా సినిమాలను మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు.కొంతమందేమో సినిమా చేద్దాం అని రెడీగా ఉన్న సమయంలో ఆ సినిమాలో వేరే హీరోల చేతిలోకి వెళ్లడంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం కారణంగా కొంతమంది బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు మంచి మంచి కథలను వేరే హీరోల దగ్గరికి వెళ్లాక కూడా మళ్లీ వాటిని తిరిగి రప్పించుకుంటారు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో ఇలా జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎన్టీఆర్ ఆది మూవీ కూడా మొదట వేరే హీరో చేయాల్సిందట. కానీ అది కాస్త జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వచ్చి ఆ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ తిరుగులేని స్టార్డం సంపాదించారు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీ మొదట చేయాల్సిన హీరో ఎవరు? ఎందుకు ఆ హీరో ఈ సినిమా చేయలేకపోయాడు అనేది ఇప్పుడు చూద్దాం..
వివి వినాయక్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కీర్తి చావ్లా హీరోయిన్గా వచ్చిన ఆది మూవీ అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాతో నందమూరి అభిమానులకి సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తర్వాత నందమూరి వంశానికి పర్ఫెక్ట్ హీరో దొరికారు అని సంబరపడిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ మాత్రం ఇప్పటికి ఎంతోమంది యూస్ చేస్తూ ఉంటారు.అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీ చేయాల్సింది ఎన్టీఆర్ కాదట.మొదట ఈ సినిమాని నటుడు ఆకాష్ చేయాలి అనుకున్నారట. కానీ అది ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఎన్టీఆర్ చేతిలోకి వచ్చిందట. అయితే ఈ విషయాన్ని బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సత్యనారాయణ రెడ్డి పలు సినిమాలకు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా చేశారు.
అలా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వివి వినాయక్ ఎవరు సినిమా ఛాన్స్ ఇస్తారా డైరెక్షన్ చేద్దామని ఆతృతతో తిరుగుతున్న రోజులవి.ఆ సమయంలో బెల్లంకొండ సురేష్ బాబు ఆయనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అయితే ఆయన అనుకున్న కథకి మొదట ఆకాష్ ని హీరో అనుకున్నారట. కానీ అది ఎన్నో మలుపులు తిరిగి చివరికి జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి ఆది సినిమా తెరకెక్కించారు. అలా ఆది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా ఆకాష్ కి ఈ విషయం తెలియకుండానే ఆయన చేతుల దాకా రాకుండానే ఆది మూవీని ఆయన మిస్సయ్యారు అంటూ నిర్మాత మల్లిడి సత్యనారాయణ చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఆది సినిమా ఎన్టీఆర్ కే సెట్ అయింది ఆకాష్ కి అస్సలు సెట్ అయ్యేది కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు