హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఆమీర్ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు అనేక సినిమాలలో హీరో గా నటించి అనేక మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అమీర్ ఖాన్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయిన ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాయి. దానితో ఆమీర్ ఖాన్ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఇకపోతే ఆమీర్ ఖాన్ ఆఖరుగా లాల్ సింగ్ చడ్డ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత అమీర్ ఖాన్ ఏ మూవీ ద్వారా కూడా ప్రేక్షకులను పలకరించలేదు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ఓ దర్శకులలో ఒకరు అమీర్ తో నెక్స్ట్ మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసల విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ మూవీ ని ఆమీర్ ఖాన్ తో చేయడానికి ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా ఆయన కోసం ఒక అతను కూడా వంశీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అమీర్ , వంశీ రెండు సిట్టింగ్స్ కూడా కంప్లీట్ చేసినట్లు , ఈ నెల చివరన అమీర్ తో వంశీ ఫైనల్ సెట్టింగ్ ఉన్నట్లు , ఆ సెట్టింగ్ లో కనుక ఆమీర్ కి స్టోరీ నచ్చినట్లయితే మూవీ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ తన టీం తో కలిసి గోవాలో స్క్రిప్ట్ డిస్కషన్లు చేస్తున్నట్లు సమాచారం.