సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే నేను “..ఈ సినిమాలో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పట్లో ఆ డైలాగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది..సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు..
ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. కొరటాల మార్క్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది.. మహేష్, కొరటాల కాంబినేషన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి.. భరత్ అనే నేను సినిమా కమర్షియల్ కూడా మంచి విజయం సాధించింది..
ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మించారు.. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ నెల 26 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు..సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తీ అవుతున్న సందర్బంగా ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది..