
SSMB 29 : మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ గ్లింప్స్ వచ్చేస్తుంది..?
RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ తో అంతకు మించిన సినిమాను రూపొందిస్తున్నాడు..మహేష్ కెరీర్ లో ఇదే అతిపెద్ద సినిమా కాబోతుంది.మరి ఈ చిత్రం లో మహేష్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ పాత్రను అడ్వెంచరస్‌గా డిజైన్ చేశారని సమాచారం.ఇది పూర్తిగా యాక్షన్ అండ్ మిస్టరీ తో కూడిన పాత్ర అని టాక్.
అంతే కాదు, ఈ సినిమా ప్రధానంగా అడవులు, పురాతన నిధుల వెతుకులాట నేపథ్యంలో నడుస్తుందని సమాచారం…ఇదిలా ఉంటే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి రాజమౌళి బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు..ఈ సినిమాకు సంబంధించి స్టన్నింగ్ గ్లింప్స్ ని రాజమౌళి సిద్ధం చేస్తున్నాడు..త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం..అలాగే ఓ బిగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి తెలియజేయనున్నారు..