
చిరు విశ్వంభర నుంచి అసలైన క్లారిటీ ఎప్పుడు .. అభిమానుల టెన్షన్ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ విజువల్ వండర్ మూవీ విశ్వంభర .. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది .. అలాగే బింబిసారా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ రామ రామ సూపర్ హిట్ అయింది .. మళ్లీ వింటేజ్ వైబ్స్ ని చూపిస్తూ మంచి ట్రీట్ ని కూడా అభిమానులకు ఇచ్చింది .. అయితే ప్రస్తుతానికి ఈ పాటని మెగా అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేస్తుండగా ..
ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం ఓ క్లారిటీ కోసం అంత ఎదురుచూస్తున్నారు .. ఆ సాంగ్ తోనే రిలీజ్ డేట్ వస్తుందని చాలామంది అనుకున్నారు .. కానీ ఈ డేట్ ని మాత్రం మేకర్స్ ఇంకా రివిల్ చేయలేదు .. దీంతో ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఇక మరి మేకర్స్ ఇది ఎప్పుడు రివిల్ చేస్తారా అనేది కూడా చూడాలి .. అలాగే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా .. యువి క్రియేషన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జులై 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అధికార ప్రకటన ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ ను కోరుతున్నారు.. ఇక మరి అభిమానుల కోరికపై యువి క్రియేషన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .