బాల‌య్య ' భైర‌వ‌ద్వీపం ' సాధించిన సెన్షేష‌న‌ల్ రికార్డులు....!

frame బాల‌య్య ' భైర‌వ‌ద్వీపం ' సాధించిన సెన్షేష‌న‌ల్ రికార్డులు....!

RAMAKRISHNA S.S.
ఆదిత్య369 తరువాత కొద్దీ కాలంలోనే 'భైరవద్వీపం' సినిమాతో మరో సారి తెలుగు సినిమా స్థాయి,సత్తా ఏంటో చూపించారు బాలయ్య. తెలుగు సినిమా అంటే ఇప్పటి జనరేషన్ కి గుర్తు వచ్చేది బాహుబలి సినిమా, అదే అంతకముందు జెనరేషన్ కి తెలుగు సినిమా అంటే ముందుగా గుర్తు వచ్చే సినిమాలు ఒకటి 'పాతాళ భైరవి', మరొకటి 'భైరవద్వీపం'. ఈ రెండు సినిమాలు ఎప్పటికి మొదటి వరసలో ఉంటాయి. 1994 లో భైరవద్వీపం ఒక సంచలనం. ఎంత చెప్పిన తక్కువే సినిమా గురించి. గ్రాస్ వైజ్ ఇండ‌స్ట్రీ హిట్ సినిమా 'భైరవద్వీపం'. అప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలు కంటే చాలా ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే 3డీ గ్రాఫిక్స్‌ ఉండటం వల్లన ఈ సినిమా షూటింగ్ 90 శాతం చెన్నైలో నిర్మించటం వల్ల అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  నిబంధనలు ప్రకారం ఈ సినిమాకి ఫుల్ ట్యాక్స్‌ కట్టాలిసి వచ్చింది. ఆలా ఫుల్ ట్యాక్స్‌ కట్టడం వల్ల వచ్చిన గ్రాస్ నుంచి షేర్ తగ్గింది.


ఫుల్ ట్యాక్స్‌లో కుడా సీడెడ్‌, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, క‌ర్నాట‌క‌, ఒడిశాలో ఆల్ టైం రికార్డు షేర్ కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రయోగాలకు ఎపుడు ముందు ఉండే బాలయ్య, మాస్‌ కథానాయకుడిగా,గ్లామరస్‌ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో ‘భైరవద్వీపం’లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. బాల‌య్య కురూపిగా చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం. బాలయ్య కురూపిగా కనిపిస్తారని థియేటర్‌లో సినిమా చూసే వరకూ అభిమానులుకు కానీ సినీ ప్రేక్షకులు కానీ ఎవరికీ తెలియదు. ఈ పాత్ర మేక‌ప్ కోస‌మే ఏకంగా రెండు గంట‌ల టైం ప‌ట్టేద‌ట‌. భోజనం చేయాలంటే మేకప్‌ తీయాలి, తీస్తే మళ్లీ రెండు గంటలు వేస్ట్‌. సమయం వృథా కాకూడదని బాలకృష్ణ దాదాపు పదిరోజుల పాటు కేవలం జ్యూస్‌లు మాత్రమే తాగేవారు.


ఆంధ్ర ,కర్నాటక,ఒరిస్సా 3 రాష్ట్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక సినిమా భైర‌వ‌ద్వీపం. పుల్ టాక్స్ లో 58 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకొన్న ఈ సినిమా లేట్ రన్ లో 26 కేంద్రాల్లో 50 రోజులు  ప్రదర్శింపబడి... 100 రోజులకు 28 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: