షాక్: విజయ్ దళపతి నకిలీ నాయకుడు కట్టప్ప కూతురు హాట్ కామెంట్స్..!

frame షాక్: విజయ్ దళపతి నకిలీ నాయకుడు కట్టప్ప కూతురు హాట్ కామెంట్స్..!

Divya
తెలుగు ,తమిళ ప్రేక్షకులకు బాగా సపరిచితమైన నటుడు సత్యరాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. తెలుగు ప్రేక్షకులకు కట్టప్ప అనే పేరు చెప్పగానే అందరు గుర్తుపట్టేస్తూ ఉంటారు.. ఇక సత్యరాజుకు సిబిరాజ్ అనే కుమారుడుతో పాటు దివ్య అనేటువంటి కూతురు కూడా ఉన్నది. దివ్య కూడా పోషకాహార నిపుణురాలుగా పని చేస్తూ ఉన్నది.. ఇలాంటి సమయంలోనే గత ఏడాది రాజకీయాలలోకి రాబోతున్నట్లు అనే ప్రకటించింది. డీఎంకే పార్టీలో చేరిన వెంటనే ఆమెకు కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించారు.


డీఎంకే  పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా రాజకీయ వేదిక మీద మాట్లాడుతూ.. దివ్య తమల వెట్రి కళగం అధ్యక్షుడు విజయాన్ని సైతం విమర్శించడం జరిగింది. ఉదయినిది విజయ్లను పోల్చి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. విజయ్ నకిలీ రాజకీయ నాయకుడు అంటూ విమర్శించడంతో ఒక్కసారిగా విజయ్ దళపతి ఫ్యాన్స్ దివ్య అను విమర్శిస్తూ ఉన్నారట. ఈయన వ్యాఖ్యలకు సైతం విజయ అభిమానులు కౌంటర్ వేస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ ఉదయనిధిస్టాలిన్ గారు ఏసీ కారు, కారు వ్యాన్ లో కూర్చొని చాలా విలాసవంత విమానలలో స్నేహితుల వివాహానికి వెళ్ళారు.. అలా  వెళ్లేటువంటి నకిలీ రాజకీయ నాయకుడే విజయ్ దళపతి.. ఉదయనిదిస్టాలిన్ చాలా కష్టపడి పని చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని వర్షం వచ్చిన, వరద వచ్చిన ప్రజల కోసమే దిగి పని చేస్తారని బిజెపి ప్రభుత్వం నుంచి తమిళనాడును కాపాడుకోవడానికి వచ్చిన మహారాజు ఉదయనిది స్టాలిన్ అంటూ తెలియజేసింది దివ్య సత్యరాజ్. అలాంటి నాయకుడిని ఎదిరిస్తే డిపాజిట్ కూడా పోతుందని అతనిని ఓడించలేరని దివ్య సత్యరాజ్ తెలియజేసింది.


కాలేజీలో చదువుతున్న రోజులలో కూడా టీచర్ అందరిని మీరు ఏమవుతారని అడగక చాలామంది మైకేల్ జాక్సన్, మరి కొంతమంది అమీర్ ఖాన్ అని చెప్పినప్పుడు తాను మాత్రం కలైంజర్ అయ్యా అభిమాని అంటూ చాలా గర్వంగా వెల్లడించానని ఈరోజు ఒక మహిళగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయనే కారణమని తెలియజేసింది దివ్య సత్యరాజ్. తనకున్న డబ్బుతో బ్రతకకుండా సొంతంగా సంపాదించాలని కోరిక కూడా తనకు కలైంజర్ వల్లి కలిగింది అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: