
కేజిఎఫ్ 3 లో అజిత్ .. మళ్లీ ఊపొందుకున్న అంచనాలు..!
ఇక మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియా స్థాయి లో భారీ హీట్ అయిన సినిమాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో లో వచ్చిన కే జి ఎఫ్ సినిమాల కి ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఎలివేషన్స్ కి కొత్త గుర్తింపు తెచ్చిన సినిమాలు గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి ..ఈ సినిమాల ఫ్రాంచైజ్ లో మూడో భాగం పై కూడా భారీ అంచనాలు నెలకున్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయం లో గత కొన్నాళ్ల క్రితం ఓ తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరో తల అజిత్ ప్రెజెన్స్ ఉంటుంద ని అలాగే నీల్ , అజిత్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అన్నట్టు గా గట్టిగా రూమర్లు కూడా వచ్చాయి ..
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అజిత్ నుంచి వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా లో అజిత్ కేజిఎఫ్ చాప్టర్ 2 లో వచ్చిన డైలాగ్స్ చెప్పటం అవి గట్టిగా పేలడం తో మరింత ఇంట్రెస్ట్ గా మారింది .. ఇక దీంతో ఇక్కడి నుంచి మళ్లీ కేజిఎఫ్ 3 పై మరికొన్ని డిస్కషన్లు మొదలయ్యాయి .. మూడో భాగం లో అజిత్ ఉండవచ్చు అనే మాటలు మళ్ళీ వినిపిస్తున్నాయి .. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది . ఎంతవరకు ఓకే అవుతుందో ... కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దాని ఇంపాక్ట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత గట్టిగా ఉంటుందని చెప్పటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు .. ఇక మరి ప్రశాంత్ నీల్ , అజిత్ సినిమా చేస్తే మాత్రం మాస్ ఎలివేషన్లకు అమ్మ మొగుడుగా ఉంటుందని కూడా అంటున్నారు .. ఇక మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి .