హిట్3 సినిమాలో ఆ సీన్లన్నీ బ్లర్ చేయనున్నారా.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

frame హిట్3 సినిమాలో ఆ సీన్లన్నీ బ్లర్ చేయనున్నారా.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
న్యాచురల్ స్టార్ నాని స్టార్ డైరెక్టర్ శేలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్3 సినిమా రిలీజ్ కావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. హిట్3 సినిమా రిలీజ్ కు చాలా సమయం మాత్రమే ఉన్నా ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. నాని సినిమా అంటే అటు క్లాస్ ప్రేక్షకులు, ఇటు మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా నాని కథలను ఎంచుకుంటున్నారు.
 
హిట్3 సినిమాలో వయొలెన్స్ ఉంటుందని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా చిన్నపిల్లలు చూడటానికి వీలు లేదని సమాచారం అందుతోంది. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయాస్సు ఉన్నవాళ్లు ఈ సినిమా చూడటానికి అర్హత కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
 
హిట్3 మూవీ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. కొన్ని సన్నివేశాలను బ్లర్ చేయాలని సెన్సార్ బోర్డ్ సూచించినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. మే నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
 
నాని ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయని తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని పారితోషికం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. హిట్3 సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హిట్3 టాలీవుడ్ రేంజ్ ను అంతకంతకూ పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: