ఆ పాన్ ఇండియా సినిమాల కోసం ఎదురుచూస్తున్నా.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు!

frame ఆ పాన్ ఇండియా సినిమాల కోసం ఎదురుచూస్తున్నా.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు!

Reddy P Rajasekhar
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రాజమౌళి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాల కోసం ప్రస్తుతం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ సినిమా రైట్స్ కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.
 
డ్రాగన్, స్పిరిట్, పెద్ది సినిమాల కోసం తాను ఎదురుచూస్తున్నానని జక్కన్న వెల్లడించగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ఎదురుచూస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. రాజమౌళి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
రాజమౌళి రెమ్యునరేషన్ ప్రస్తుతం1 50 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మరో డైరెక్టర్ లేరనే చెప్పాలి. రాజమౌళి తన మార్కెట్ అంతకంతకూ పెరిగేలా తెలివిగా అడుగులు వేస్తునారు. రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
 
స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుతో ఏ రేంజ్ సినిమాను తెరకెక్కిస్తున్నారో చూడల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ బాబు ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు. టాలీవుడ్ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచడంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ కీలక పాత్ర పోషించనుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మహేష్ బాబు ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసం మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: