న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని 'హిట్ 3' మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ 'హిట్' మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్ అదరగొట్టాడు..ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత 'హిట్' మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో 'హిట్' మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..
'హిట్' మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు...ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ నాని యాంగ్రీ మ్యాన్ గా అదరగొట్టాడు.. వైల్డ్ పోలీస్ ఎలా ఉంటాడో నాని తన నటనతో చూపించాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'హిట్ 3' ట
ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది..
ఈ మూవీ ట్రైలర్ ను రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్ లో లాంచ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.. అలాగే రేపు ఉదయం 11.07 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు..మే 1 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది...ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్ కొలను 'హిట్ 3' సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిం చాడు....ఇదిలా ఉంటే త్వరలో రాబోయే 'హిట్ 4' కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం..