అలా చేసి.. కోట్ల రూపాయలు నష్టపోయా..సమంత సంచలన వ్యాఖ్యలు..!

frame అలా చేసి.. కోట్ల రూపాయలు నష్టపోయా..సమంత సంచలన వ్యాఖ్యలు..!

Divya
టాలీవుడ్ సెలబ్రెటీలు సినిమాల ద్వారానే కాకుండా పలు రకాల వ్యాపారాలు, యాడ్స్ ద్వారా భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికీ ఎంతమంది సెలబ్రిటీలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా 15 బ్రాంచ్ యాడ్స్  వదులుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఒక ఏడాదిలోను వదులుకున్నట్లు తెలియజేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత వీటివల్ల కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టపోయినట్లు తెలియజేసింది. ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో ఎన్నో సక్సెస్ ప్రాజెక్టులను నటించానని తెలిపింది.


అలాగే ఎన్నో యాడ్స్ చేస్తూ ఉండేదాన్ని ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా ఉండేదాన్ని అప్పట్లో తాను మల్టీ నేషనల్ బ్రాంచ్ కి కూడా అంబాసిడర్ గా వ్యవహరించినట్లు వెల్లడింది. ఆ సమయంలో అది తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుందని తెలుసుకున్నానని తెలియజేసింది.. మనం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలని.. గతంలో ఇష్టం వచ్చిన యాడ్స్ కి సైతం ఎక్కువగా అంబాసిడర్ గా ఉన్నానని అందుకే తాను క్షమాపణలు తనకే చెప్పుకున్నానని తెలియజేసింది.


అందుకే గడిచిన ఏడాది కాలంలో తాను 15 ఎండార్స్మెంట్స్ ను వదులుకున్నానని వీటివల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగిందని వెల్లడించింది. సమంత ఇప్పటికీ తన వద్దకు చాలా ఉత్పత్తులకు సంబంధించి అలాగే వాణిజ్య ప్రకటనలకు సంబంధించి యాడ్స్ చేయాలంటూ పలు రకాల ఆఫర్స్ వస్తూ ఉన్నాయి కానీ తాను ఇప్పుడు ఏదైనా బ్రాండ్లను ప్రమోట్ చేసే ముందు కచ్చితంగా ఇద్దరు ముగ్గురు వైద్యులతో తనిఖీ చేయించి మరి సమాజానికి ఉపయోగపడేటివి లేకపోతే హాని కనిపించేదా అనేటువంటి వాటిని నిర్ణయించుకున్న తర్వాతే ప్రమోట్ చేస్తూ ఉన్నానని తెలియజేసింది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: