అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలవడం సాధ్యమేనా?

frame అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలవడం సాధ్యమేనా?

Reddy P Rajasekhar
కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలలో హిట్ అయిన సినిమాలు ఎన్ని అనే ప్రశ్నకు చాలా తక్కువ సినిమాలు మాత్రమేనని సమాధానం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కు ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.
 
అర్జున్ సన్నాఫ్ వైజయంతి కోసం కళ్యాణ్ రామ్ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని తెలుస్తోంది.అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని భోగట్టా. కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
 
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల కానుంది. ఈ సినిమాకు బిజినెస్ ఒకింత భారీ స్థాయిలోనే జరిగిందని భోగట్టా. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సమ్మర్ సీజన్ ను భారీ స్థాయిలో క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
 
ఓదెల2 సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదలవుతోంది. అయితే ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్లలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. ఓదెల2 సినిమాకు అన్నీ తానై వ్యవహరించడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: