ఏఐ గొప్పదని చెప్పడంలో తప్పులేదు: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

MADDIBOINA AJAY KUMAR
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండారు. ఈయనకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మకి మంచి క్రేజ్ ఉంటది. ఈయన నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి వర్మ వార్తల్లో మెరిశారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఏఐ గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏఐ అత్యంత వేగంగా అబివృద్ది చెందుతూ వస్తుంది. ఏఐ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాదు మరెన్నో చేస్తుంది. నేడు కోట్లాది మంది ఈ ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినీ రంగంలో కూడా ఏఐని పలు పనుల్లో ఉపయోగిస్తున్నారు.

 
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీపైన ఏఐ ప్రభావం చాలా ఉంది. ఏఐ మనిషి కన్నా వేగంగా పరిగెడుతుంది. మనం క్రియేట్ చేసిన టెక్నాలజీయే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఏఐనే.. మనమే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏఐని దేవుడు ఉన్నాడా అని అడిగిన సమాధానం చెప్తుంది. వైద్యం గురించి కూడా చెప్పేస్తుంది. డాక్టర్ తో కూడా అవసరం లేదు. ఏఐ కారణంగా కొన్ని లక్షల కేసులు వస్తుంటాయి. అలాంటప్పుడు మనిషి కంటే ఏఐ గొప్పదని చెప్పడంలో తప్పులేదు' అని వర్మ చెప్పుకొచ్చాడు.  ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 
అయితే ఇదిలా ఉండగా.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమాలో సత్య యాధు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 4న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా శారీ కాదు స్కేరి అనేలా ఉందని టాక్ వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: