60 ఏళ్ల హీరోకు జంటగా క్రేజీ హీరోయిన్ .. ఏజ్ ట్రోలింగ్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రబాస్ హీరోయిన్ ..!

frame 60 ఏళ్ల హీరోకు జంటగా క్రేజీ హీరోయిన్ .. ఏజ్ ట్రోలింగ్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రబాస్ హీరోయిన్ ..!

Amruth kumar
మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .  తెలుగుతో పాటు తమిళం , మలయాళం భాషలో ఎన్నో సినిమాల్లో నటించారు .. ఇటీవ‌లే ఎల్ 2 ఎంపురాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .  ఇక ఈ సినిమా పై ఓవైపు వివాదం  నడుస్తుండ గా ఇప్పుడు మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లు రాబడుతుంది ..అయితే స్టార్ హీరో మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే .. ఇందులో స్టార్ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది ..

 

సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ రీసెంట్ గానే కంప్లీట్ అయినట్టు ప్రకటిస్తూ మాళవిక మోహన్ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను పంచుకుంది . అయితే ఆమె పోస్ట్ పై నెటిజన్స్  తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు .. మోహన్ లాల్ , మాళవిక మధ్య వయసు వత్యాసం గురించి కూడా కామెంట్లు చేస్తున్నారు .. ఇక దీంతో తన గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై మాళవిక తీవ్రంగా స్పందించింది .. ఇక “నువ్వు ఇలా మనుషులను ఎలా తూకం వేస్తావో తెలుసా?” అంటూ కౌంటరిచ్చింది . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

 

మాళవిక మోహన్ లాల్ తో కలిసి షూటింగ్ కు సంబంధించిన ఫొటోస్ ను పంచుకుంది .. మోహన్ లాల్ సార్ అండ్ సత్యన్ సర్ వంటి ప్రముఖుల నుండి నేను చాలా నేర్చుకున్నాను సినిమాలో వాళ్ళు మ్యాజిక్ చేసే విధానం న‌న్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ అందులో  రాసుకొచ్చింది.   అలానే చాలా ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పని చేస్తానని , అలాగే తెక్కడిలోని అందమైన కొండలు తేయాకు తోటలతో సంతోషంగా ఒక నెల  ఆనందంగా గడిచిపోయింది అని కూడా చెప్పకు వచ్చింది . ప్రస్తుతం మాళవిక మోహనన్ ప్రభాస్ కు జంటగా రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది .


auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by Malavika Mohanan (@malavikamohanan_)



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: