హైప్ కోసం ట్రైలర్‌లో బూతులు .. ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదుగా ..?
సెన్సార్ సమయంలో ఆ డైలాగులను మ్యూట్ చేయడం లేదా కట్ చేయటం కచ్చితంగా జరుగుతుంది . ఇక సెన్సార్ అలాంటి డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తుందనే విషయం సినిమా యూనిట్‌కు కూడా బాగా తెలుసు . అయినా వారు సినిమాకు హైప్ తీసుకురావడం కోసం ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు . అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు .. అర్జున్ రెడ్డి సినిమా సమయంలోనే బూతులతో పబ్లిసిటీ చేసుకోవడం మొదలుపెట్టారు .. ఇక ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది . ఒకరకంగా ఆ రచ్చే ఈ సినిమాకు మరింత హై తీసుకురావడంలో ఎంతో సహాయపడింది .
ఇక అందుకే ఆ తర్వాత చాలామంది ఇలాంటి ప్రయోగాలు కూడా చేశారు . యంగ్ హీరో విశ్వక్‌సేన్ తన ప్రతి సినిమా ట్రైలర్లో ఇలాంటి అభ్యంతరకర పదాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ..ఫలక్‌నమాదాస్, దమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్స్ లో బూతులు గట్టిగా వినిపించాయి. ఇక రీసెంట్ గా నాని హీరోగా శ్రీకాంత్ ఓదలా తెర్కక్కిస్తున్న యాక్షన్ మూవీ ది పారడైజ్ సినిమా అనౌన్స్మెంట్ టీజర్ లోను ఇలాంటి ఒక పదం వినిపించడంతో ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదంటున్నారు సినిమా క్రిటిక్స్ .