గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్ చేయాలని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. ఏమైందంటే?
ఈ ఏడాది విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో రామ్ చరణ్ పై అభిమానంతో అభిమానులు ఏకంగా 256 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కటౌట్స్ విషయంలో ఇప్పటివరకు ఇదే రికార్డ్ అనే సంగతి తెలిసిందే. అయితే ఈ రికార్డును బ్రేక్ చేయాలని అజిత్ ఫ్యాన్స్ ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
285 అడుగుల అత్యంత భారీ కటౌట్ ను ఏర్పాటు చేయాలని అజిత్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. అయితే ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ గ్రిల్ కూలిపోవడం గమనార్హం. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. అజిత్ పలు సందర్భాల్లో తనకు ఫ్యాన్స్ అసోసియేషన్ వద్దని సూచించిన సంగతి తెలిసిందే.
గతంలో అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేసే సమయంలో ఐదుగురు అభిమానులకు తీవ్ర గాయాలు అయిన సంగతి తెల్సీందే. ఆ సమయంలో అజిత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తనకు ఎలాంటి బిరుదులు వద్దని అజిత్ పలు సందర్భాల్లో చెప్పారు. సినిమా నచ్చితే చూడాలి తప్ప ఇలాంటి పనులు చేస్తే మాత్రం తాను అస్సలు సహించనని అజిత్ వెల్లడించడం గమనార్హం.
ఈ ప్రమాదం గురించి అజిత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అజిత్ ఒకింత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. అజిత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయొ చూడాల్సి ఉంది. అజిత్ కెరీర్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని భారీ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అజిత్ ఇతర భాషల్లో సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జరిగిన ఘటనల నేపథ్యంలో అజిత్ ఫ్యాన్స్ ఒకింత జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.