ఆ హీరోయిన్ నవ్వితే దెయ్యంలా ఉంటుంది.. నిర్మాత కామెంట్స్ వైరల్?
నిర్మాత దినేష్ విజాన్ చేసిన ఈ కామెంట్స్‌తో నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రద్ధా కపూర్‌ను దెయ్యంతో పోల్చడం ఏంటని ఆయనపై ఫైర్ అవుతున్నారు. కొంతమంది అయితే దినేష్ విజాన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ‘ఈ మిసోజనిస్ట్ మగాళ్లు ఆమె యాక్టింగ్‌ను ఎప్పుడూ మెచ్చుకోరు. ఆమె గురించి ఎలా మాట్లాడుతున్నారో చూడండి’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
‘సినిమా ప్రమోషన్స్‌లో ఆమె పేరు వాడుకుని, కోట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో కూర్చొని ఆమెనే వెక్కిరిస్తారా?’ అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ‘ముందు అపర్ శక్తి, ఇప్పుడు నువ్వా? పబ్లిక్‌గా హీరోయిన్‌లను కించపరచడం ట్రెండ్‌లా తయారైందా? శ్రద్ధాకి మంచి టీమ్ కావాలి’ అంటూ ఇంకొక నెటిజన్ ఘాటుగా స్పందించారు.
విమర్శలు ఎలా ఉన్నా.. శ్రద్ధా కపూర్ మాత్రం తన పనితో దుమ్ములేపుతోంది. ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. సక్సెస్ వచ్చినా కూడా శ్రద్ధా మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. సినిమా హిట్ అయిన సంతోషాన్ని తన టీమ్‌లోని అమ్మాయిలతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. ‘ఇది గర్ల్ పవర్’ అంటూ వాళ్లను మెచ్చుకుంది.
నిర్మాత కామెంట్స్‌తో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా.. శ్రద్ధా సక్సెస్ వాటికి సమాధానం చెబుతోంది. టాలెంట్, స్ట్రెంగ్త్‌కి సింబల్‌గా నిలుస్తూ.. సక్సెస్ కోసం ఎవరి వాలిడేషన్ అవసరం లేదని శ్రద్ధా ప్రూవ్ చేస్తోంది.