సంప‌త్‌నంది మార్క్ బిజినెస్ @ 28 కోట్లు... ఇదే టాలీవుడ్ ట్రిక్ అంటే..!

frame సంప‌త్‌నంది మార్క్ బిజినెస్ @ 28 కోట్లు... ఇదే టాలీవుడ్ ట్రిక్ అంటే..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ... మాస్ హీరోలు, స్టార్ హీరోల‌కే రిలీజ్‌కు ముందు బిజినెస్ అవ్వ‌డం లేదు .. కానీ ఓటీటీలు, థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముకోవ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. కానీ ఇటీవ‌ల కాలంలో స‌రైన హిట్ లేని డైరెక్ట‌ర్ సంపత్‌నంది మాత్రం త‌న ‘ ఓదెల 2 ’ సినిమాని ఒక్క టీజ‌ర్ చూపించి హాట్ కేక్‌లా అమ్మేసుకోవ‌డం ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక త‌మ‌న్నా కీ రోల్ పోషించిన సినిమా ఓదెల 2. సంప‌త్ నంది షో ర‌న్న‌ర్‌. ఈ నెల 17న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా బిజినెస్ దాదాపు క్లోజ్ అయ్యింది. ఓటీటీ, నాన్ థియేట‌ర్, థియేట‌ర్ రైట్స్ రూపంలో రూ.28 కోట్లు ఇప్ప‌టికే సంప‌త్ నంది ఖాతాలో ప‌డ్డాయి. ఇక థియేట్రిక‌ల్ రైట్స్ ని స‌న్ పిక్చ‌ర్స్ కు అమ్మేశారు. ఈ డీల్ రు. 10 కోట్ల‌కు సెట్ అయ్యింది. ఇది వ‌ర‌కే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. ఈ సినిమాకు టోట‌ల్‌ బ‌డ్జెట్ రూ.25 కోట్ల లోపు మాత్ర‌మే అయ్యింది. ఈ లెక్క‌న చూస్తే ఈ సినిమా ఇప్ప‌టికే టేబుల్ ప్రాఫిట్ సినిమా గా చెప్పాలి.


తెలుగు శాటిలైట్‌, హిందీ, త‌మిళ‌ థియేట్రిక‌ల్ రైట్స్ ఇంకా సంప‌త్ నంది చేతుల్లోనే ఉన్నాయి. ఆ రూపంలో వ‌చ్చిన ప్ర‌తీ రూపాయీ నిర్మాత‌కు లాభ‌మే. ఇటీవ‌ల త‌మ‌న్నా సోలోగా కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమా ల‌లో దేనికి జ‌ర‌గ‌నంత బిజినెస్ ఈ సినిమాకు జ‌రిగింది. ఇటీవ‌లే ఓ టీజ‌ర్ వ‌దిలారు. ఇక ట్రైల‌ర్ వ‌చ్చాక ప్ర‌మోష‌న్ల జోరు పెంచబోతున్నారు. సినిమా కు 2గంట‌ల 23 నిమిషాల ర‌న్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ... ఆయ‌న ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అంటున్నారు.  భ‌క్తి, భ‌యం.. ఈ రెండింటినీ రంగ‌రించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: