2026లో రిలీజ్ కానున్న భారీ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా లేదుగా!

Reddy P Rajasekhar
2025 సంవత్సరంలో పెద్ద సినిమాలు ఎక్కువ సంఖ్యలో రిలీజ్ కావడం లేదనే సంగతి తెలిసిందే. వార్2, ది రాజాసాబ్, విశ్వంభర, అఖండ2 విడుదల కానుండగా వచ్చే ఏడాది మాత్రం పాన్ వరల్డ్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ కానుంది. 2026 సంవత్సరంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా, రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమా, ప్రభాస్ హను రాఘవపూడి సినిమా సమ్మర్ కానుకగా షెడ్యూల్ అయ్యాయని తెలుస్తోంది.
 
ఈ సినిమాలతో పాటు బన్నీ అట్లీ కాంబో మూవీ పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ మరికొన్ని సినిమాలు షెడ్యూల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 2026 సంవత్సరం సినీ అభిమానులకు మాత్రం పండగేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్లు కూడా కళకళలాడే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
2026 సంవత్సరం సినీ అభిమానులకు స్పెషల్ ఇయర్ గా నిలవబోతుందని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 2026 సంవత్సరంలో రిలీజ్ కానున్న సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది. సినీ అభిమానులకు 2026 స్పెషల్ ఇయర్ గా నిలవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సినీ అభిమానులు సైతం తమ హీరోల సినిమాలు సంచలనాలు సృష్టించాలని ఫీలవుతున్నారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద సినిమాల హవా నడుస్తోంది. పెద్ద సినిమాలు కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి. టాలీవుడ్ పెద్ద సినిమాలు భాషతో సంబంధం లేకుండా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర భాషల్లో సైతం ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని కచ్చితంగా చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించనున్నాయో చూడాల్సి ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: