విజయశాంతిపై మోజు పడ్డ డైరెక్టర్..ఎవరంటే..?

frame విజయశాంతిపై మోజు పడ్డ డైరెక్టర్..ఎవరంటే..?

Pandrala Sravanthi
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలతో సమానమైనటువంటి పేరు తెచ్చుకున్న  హీరోయిన్లలో మొదటి స్థానం లో ఉంటారు విజయశాంతి. అప్పట్లో హీరోలతో పోటీ పడి ఈమె సినిమాలు నడిచేవి. అలాంటి విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా లేడి ఓరియంటెడ్ వంటి ఎన్నో పాత్రలో చేసినటువంటి విజయశాంతి, హీరోలకు దీటుగా చేసింది. అప్పట్లో ఈమె చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనమే సృష్టించాయని చెప్పవచ్చు. అంతేకాదు ఈమె ఇండస్ట్రీలోని హీరోలలో ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణ వెంకిలతో సినిమాలు చేసింది. వీరి కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి అంటే థియేటర్లలో హౌస్ ఫుల్ అయ్యేవి.. ఇక వీళ్లే కాకుండా  విజయశాంతి కి అత్యంత హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్ర రావు. 


ఈయన విజయశాంతి తో వరుసగా సినిమాలు చేసేవారు. దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లో పది కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇందులో చాలావరకు సూపర్ హిట్ సినిమాలే. ఈ విధంగా విజయశాంతి మంచి ఏజ్ లో ఉన్నప్పుడు  దర్శకేంద్రుడు ఆమెతో వరుస సినిమాలు చేయడం వల్ల వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. అంతేకాదు ఆయన విజయశాంతిపై మనసు పడ్డారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ దర్శక నిర్మాత గీతా కృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏమిటో తెలియదు కానీ  సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తాజాగా ఎమ్మెల్సీ పదవిని కూడా అందుకుంది. ఆమె సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలి లో దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: