ప్రజలంతా ఎంతో ఆదర్శంగా తీసుకునే గొప్ప దేవుడు శ్రీరాముడు..హిందువుల ప్రత్యక్ష ఆరాధ్య దైవం అయినా శ్రీరాముడి గుడి లేని ప్రదేశం అంటూ లేదు..సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారం కావడంతో శ్రీరాముడిని హిందూ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు..పితృ వాక్య పరిపాలకుడు, సీతా సమెత శ్రీరాముడి కథ ఆధారంగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శ్రీ రాముడి పాత్ర ధరిస్తే నిజంగా ఆ శ్రీరాముడే ప్రత్యక్షం అయినట్లుగా ఉండేది..రాముడిగా అన్న ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు..శ్రీ రాముడిగా ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం సంపూర్ణ రామాయణం..ఆ తరువాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం,శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాలతో ఎన్టీఆర్ రాముడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.. అయితే ఎన్టీఆర్ కంటే ముందుగా నే రాముడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు మెరిసారు..అలాగే హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, రవికుమార్, శ్రీకాంత్, సుమన్, బాలకృష్ణ వంటి వారు రాముడి పాత్రల్లో నటించారు.. ఇక నేటి తరం స్టార్ హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ శ్రీరాముడి పాత్రల్లో కనిపించి మెప్పించారు.
అయితే ఎన్టీఆర్, నాగేశ్వరరావు కంటే ముందు తొలిసారి రాముడి పాత్రలో తెలుగు తెర మీద కనిపించిన వ్యక్తీ యడవల్లి సూర్యనారాయణ..తెలుగులో తొలి టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' అయితే రెండో టాకీ చిత్రం 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకం' తెరకెక్కింది.. అయితే రెండు సినిమాలు ఒకే ఏడాది పూర్తయ్యాయి. భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరిలో, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం 1932 డిసెంబరులో విడుదలయ్యాయి.. యడవల్లి సూర్యానారాయణ గారు 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ సినిమా ద్వారా తెలుగు తెర పై మొదటి సారి రాముడి పాత్రలో కనిపించారు..బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రంలో సీతగా సురభి కమలాబాయి నటించారు.
రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చేవరకు, సింహాసనంపై రాముడి పాదుకలను ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.తొలి తెలుగు సినీ రాముడుగా అలరించిన యడవల్లి సూర్యనారాయణ రంగస్థలం నుంచి వచ్చినారు..సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన ఎంతో క్రేజ్ వున్న యాక్టర్.. నాటక సమాజాలతో సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్ మూవీటోన్ గ్రూప్ వారి ప్రతిష్ఠాత్మక యాక్టర్‌గా నిలిచారు.. దాదాపు మూడేళ్ళు సినిమాల్లో ఆకట్టుకున్న ఆయన ఆ తరువాత నాటక రంగానికి వెళ్లిపోయారు..