విశ్వ నటుడు కమల్ హాసన్ సినిమాల కంటే ఎక్కువగా పెళ్లిళ్ల ద్వారా ఎఫైర్ల ద్వారానే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఈయన తన నటనతో యూనివర్సల్ హీరో అని పేరు తెచ్చుకున్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని తప్పుల కారణంగా వివాదాల్లో ఇరుక్కున్నారు. మొదట వాణి గణపతి అనే నాట్య కళాకారిణిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి సారికను పెళ్లి చేసుకొని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశారు.ఆ తర్వాత కొద్ది రోజులు గౌతమీతో డేటింగ్ చేసినప్పటికీ వీరి మధ్య బంధం కూడా ఎక్కువ రోజులు నిలువ లేదు. అలా వీరి సహజీవనం కూడా కొద్దిరోజులే కొనసాగింది.అయితే ఆ మధ్యకాలంలో కమల్ హాసన్ తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత భరణం ఇచ్చి దివాళా తీశాను అంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కాబట్టి కమల్ హాసన్ చేసిన ఈ ఆరోపణలు కూడా క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఈయన ఆరోపణలపై మొదటి భార్య వాణి గణపతి స్పందించింది.. వాణి గణపతి మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన భరణంతో కమల్ హాసన్ దివాళా తీశానని చెప్పడం చాలా హాస్యాస్పదం.ఆయన పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు.విడాకులు అయిన వివాహం గురించి నేను ఎక్కడా కూడా స్పందించలేదు.ఎందుకంటే అది నా పర్సనల్ విషయం కాబట్టి. దీని గురించి మాట్లాడానికి నాకు ఇష్టం లేదు.కానీ కమల్ హాసన్ మాత్రం నాకు భరణం ఇచ్చి దివాళా తీసాను అని చెప్పడం వెకిలి చేష్టలే.కమల్ హాసన్ తో విడిపోయిన తర్వాత ఆయనతో కలిసి ఉన్న ఫ్లాట్ తో పాటు అందులో ఉన్న ఏ వస్తువుల్ని కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు.
అలాంటిది నాకు భరణం ఇచ్చి దివాళా అంటే ఎలా నమ్ముతారు. ప్రపంచంలో ఉన్న ఏ న్యాయవ్యవస్థ కూడా భరణం కింద భర్త ఆస్తులు అన్ని ఇచ్చేసి దివాళా చేసేలా చేయదు. కానీ కమల్ ఆరోపణలు చాలా నీచంగా ఉన్నాయి.. నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా కమల్ హాసన్ పై బురద జల్లే ప్రయత్నం చేయలేదు.కానీ కమల్ ఈ ఆరోపణలు చేయడం నా దృష్టిలో పిచ్చి పట్టినట్లే అన్నట్లుగా వాణి గణపతి మాట్లాడింది. అంతే కాదు ఇప్పటివరకు నేను నా సొంత సంపాదనతోనే జీవితంలో ఎదిగాను ఎవరి డబ్బులు నేను తీసుకోలేదు అంటూ సంచలన కామెంట్లు చేసింది వాణి గణపతి.