HDB రామ్ చరణ్: రామ్ చరణ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

frame HDB రామ్ చరణ్: రామ్ చరణ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో కొడుకు అయ్యుండి కూడా తన సొంత కాళ్ల మీదే నిలబడి ఇండస్ట్రీలో నిలబెట్టుకొని గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ ఎంతో హార్డ్ వర్క్ చేసి మగధీర వంటి సినిమాతో ఎవరు సాధించలేని రికార్డులను బద్దలు కొట్టారు రామ్ చరణ్. రామ్ చరణ్ మొదట సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది ఈయన యాక్టింగ్ ని లుక్స్ ని విమర్శించారు.



ఇక ధ్రువ సినిమాతో కొత్త స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకోగా ఆ తర్వాత రంగస్థలం సినిమాతో తన తండ్రి చిరంజీవిని మించిపోయిన తనయుడుగా పేరు సంపాదించారు. rrr చిత్రంలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించారు. రామ్ చరణ్ తన నటన డాన్స్ ఫైట్స్ తో అందరినీ మెప్పించారు. rrr చిత్రంతో హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఇతర దేశాలలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు రామ్ చరణ్. పాన్ ఇండియాలోనే కాకుండా జపాన్ అమెరికా వంటి దేశాలలో కూడా తన మార్కెట్ ని పెంచుకున్నారు రామ్ చరణ్.


రామ్ చరణ్ తండ్రిని మించి మరి మంచితనం , మానవత్వం కలిగిన హీరోగా పేరు సంపాదించారు ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుండి మరి నడిపిస్తూ ఉంటారు రామ్ చరణ్. ముఖ్యంగా భార్య ఉపాసన కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటుంది. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనే స్థాయి నుంచి గ్లోబల్ హీరో రామ్ చరణ్ అనే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన కూతురి కోసం ప్రత్యేకించి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.అలాగే ఎంతో దూరం నుంచి ఇంటికి వచ్చిన అభిమానులను మర్యాదపూర్వకంగానే మాట్లాడి మరి పంపిస్తూ ఉంటారు రామ్ చరణ్.ప్రస్తుతం RC -16 సినిమాలో నటిస్తూ ఉండగా ఆ తర్వాత చిత్రం డైరెక్టర్ సుకుమార్ తో చేయబోతున్నారు. ఈ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: