ఆ హీరో కోసం అమ్మ నా బూతులు తిట్టుకుంటున్న అక్క చెల్లెలు లాంటి స్టార్ హీరోయిన్స్..!?

frame ఆ హీరో కోసం అమ్మ నా బూతులు తిట్టుకుంటున్న అక్క చెల్లెలు లాంటి స్టార్ హీరోయిన్స్..!?

Thota Jaya Madhuri
సాధారణంగా అక్క చెల్లెలు గొడవలు పడుతూనే ఉంటారు . వాళ్ళ మధ్య ఎంత ప్రేమ .. అనురాగాలు .. ఆప్యాయతలు ఉంటాయో అంతే గొడవలు తగదాలు ఉంటాయి . డ్రెస్సుల విషయం కారణంగా కావచ్చు..  మేకప్ ఐటమ్స్ కారణంగా కావచ్చు స్టడీస్ విషయంగా కారణం కావచ్చు.. రీజన్స్ ఏదైనా సరే అక్క చెల్లెల మధ్య ఫైటింగ్ చాలా మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది.  ఇది అక్కాచెల్లెళ్లకు మాత్రమే అర్థమవుతుంది . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో అక్కా చెల్లెలు లాంటి హీరోయిన్స్ గొడవలు పడుతున్నారట. అది కూడా ఓ హీరో కారణంగా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వాళ్లు మరెవరో కాదు శ్రీ లీల - రష్మిక మందన్నా.  ఎస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే శ్రీలీల కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా కన్నడ హీరోయిన్ . రష్మిక మందన్నా ఇండస్ట్రీలోకి ముందుగా ఎంట్రీ ఇచ్చింది.  ఇప్పుడు రష్మిక రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో అందరికీ తెలిసిన విషయమే . అయితే శ్రీ లీల తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అది తక్కువ టైం లో స్టార్ హీరోయిన్గా మారింది . కాగా ఇప్పుడు రష్మిక మందన్నా - శ్రీ లీలా ఒక సినిమాలో ఆఫర్ కోసం బాగా హీట్ పెంచే విధంగా మాట్లాడేసుకుంటున్నారట.


మనకు తెలిసిందే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ తో కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా  రష్మిక మందన్నా అని అనుకున్నారట సుకుమార్ . కానీ పదేపదే అదే హీరోయిన్ తో సినిమా తెరకెక్కిస్తే ఆయన డైరెక్షన్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి ఏమో అంటూ శ్రీలీలను చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఆశ్చర్యం  ఏంటంటే సుకుమార్ కి అసలు శ్రీ లీలా పేరు సజెస్ట్ చేసిందే రష్మిక మందన్నా.  పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీ లీలా పేరుని స్వయంగా ప్రపోజల్ కి తెచ్చింది రష్మిక  అంటూ అప్పట్లో టాక్ వినిపించింది .
ఇప్పుడు రష్మిక మందన్నా స్థానానికి ఎసరు పెట్టే రేంజ్ కి  వెళ్ళిపోయేలా ఉంది శ్రీలీల అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మరింత రేంజ్ లో హీట్ పెంచేస్తుంది . పైగా గ్లోబల్ హీరో తో సినిమా ఛాన్స్ అంటే ఊరికే రాదు . ఇప్పటివరకు శ్రీ లీల - రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.  రష్మిక మందన్నా కూడా రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.  అందుకే ఈ సినిమా ఆఫర్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట ఈ కన్నడ బ్యూటీస్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: