చిరంజీవికి తెలియకుండానే ? మోహన్ బాబు ఇంత‌ కథ నడిపించారా..!

frame చిరంజీవికి తెలియకుండానే ? మోహన్ బాబు ఇంత‌ కథ నడిపించారా..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా జనాల లో తెలియని వారు ఉండరు. చిరంజీవి కెరియర్ ను మోహన్ బాబు కాపాడడం ఏంటి ..? ఈయన మెగాస్టార్ చిరంజీవి, ఆయనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరకు ఇద్దరే మోహన్ బాబు, చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో నటించేవారు కదా.. ఇంత పెద్ద నటుడు చిరంజీవి కెరీర్ కాపాడమేంటి అనుకుంటున్నారా. ఇది నమ్మటానికి కష్టంగానే అనిపించిన కూడా ఇదే నిజం .ఒక సమయంలో చిరంజీవి కెరీర్ నిలబెట్టిన బ్లాక్ బాస్టర్ సినిమా ముందు మోహన్ బాబు కి వచ్చింది. అనుకోకుండా ఆ సినిమా చిరంజీవి చేయవలసి వచ్చింది. ఆ సినిమాతో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. మెగాస్టార్ ఇంతకీ ఆ సినిమా ఏమిటో తెలుసా.. 'హిట్లర్'. 1997లో విడుదలైన ఈ సినిమా మొదట మోహన్ బాబు కి ఆఫర్ చేశారు .దర్శక, నిర్మాతలు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దబ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

 మమ్ముట్టి నటించిన బ్లాక్ బాస్టర్ మలయాళ సినిమాకి హిట్లర్ అధికారిక తెలుగు రీమేక్. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవ్వకముందు చాలా పెద్ద కథ జరిగింది .నిర్మాత ఎడిటర్ మోహన్ పెద్ద కొడుకు అప్పట్లో హిట్లర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. మోహన్ రాజా మలయాళం వెర్షన్ విడుదలకు వారం ముందే తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో మలయాళం విడుదలకు కొన్ని రోజుల ముందు ప్రముఖ రచయిత మరుదురి రాజును ఈ సినిమా చూడమని మోహన్ రాజా కోరాడు .రాజా అతని భార్య హోటల్లో గదిలో హిట్లర్ సినిమా చూశారు .ఈ సినిమా చూసిన తర్వాత మోహన్ రాజా తో మాట్లాడుతూ ఈ సినిమాను తెలుగులో తీస్తే మంచి బ్లాక్ బాస్టర్ అవుతుందని అనుకున్నారు. తనకే ఆ ఆలోచన వచ్చిన వెంటనే మోహన్ బాబుతో, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రీమేక్ చెయ్లని అనుకున్నాడు. మోహన్ బాబు అప్పటికే రవిరాజా పినిశెట్టితో పెద్దరాయుడు చేయటంతో ఈ రీమేక్ ఆఫర్ తిరస్కరించాడు .

 మోహన్ బాబు నో చెప్ప‌డంతో ఈ ప్రాజెక్టు చిరంజీవి కి దక్కింది. చిరంజీవి సినిమా తీసేటప్పుడు చాలానే మార్పులు చేశారు. ఆయనకి కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేపించారు . తన ఇమేజ్ కు సరిపడా స్క్రీన్ ప్లే లో మార్పులు చేశారు. తెలుగు వెర్షన్ కాబట్టి కామెడీకి మంచి ఇమేజ్ పెరిగింది. ఈ సినిమాకు ఎల్బీ శ్రీరామ్ మాటలు రాశారు. మూడు ,నాలుగు  ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి కెరీర్ కు హిట్లర్ మంచి హిట్ ని తెచ్చి పెట్టింది. ఈ బ్లాక్ బాస్టర్ తరువాత చిరంజీవి వరుస హిట్లను కొట్టాడు. మాస్టర్, చూడాలని ఉంది ,బావగారు బాగున్నారా, అంటూ ఇలా వ‌రుస విజ‌య‌లు అందుకున్నారు .. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు న‌టించిరు .. ఈ సినిమా హిట్ అవ్వడానికి కూడా  ఈ సినిమాలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు .ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ ,హీరోయిన్ రంభ, సుధాకర్ కామెడీ అయితే అంతా ఇంతా కాదు. ఈ మూవీలో అందరి ప్రోత్సాహంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అలా తెలియకుండానే చిరంజీవి కెరియర్ కు మోహన్ బాబు చాలా పెద్ద హెల్ప్ ఏ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: