
పురిజీ ఏంటి ఆ స్పెషల్ ..ప్లానింగ్ అదిరిపోయిందిగా..?
ఆయన్ని ఓ సినిమాకి ఒప్పించమంటే అది మామూలు పని కాదు .. ఆయన లాంగ్ కెరియర్ దృష్టిలో పెట్టుకుని సెలెక్టివ్ గా ముందుకు వెళుతున్నాడు .. ఇలాంటి నటుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడా ? అంటే అవునని కోలీవుడ్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది . రీసెంట్ గానే విజయ్ సేతుపతి కి పూరి జగన్నాథ్ స్టోరీ కూడా చెప్పాడట .. ఆ కథ నచ్చడం తో మరో ఆలోచన లేకుండా విజయ్ సినిమా చేయడానికి ఒకే చెప్పినట్టు సమాచారం .. ఇక దీంతో పూరి అతన్ని ఎలా ఒప్పించాడు ? అన్నది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది . ఇక పూరి సినిమాలు ఎలా ఉంటాయి ? అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ..
పూర్తిగా మాస్ ఫార్ములా తో ఔవుట్డేటెడ్ గా మారిన విషయం తెలిసిందే . అలాగే గత కొంతకాలంగా సక్సెస్ లేక ఎంతో వెనకబడ్డాడు. అలాగే ఆయన తీసిన సినిమాలను మళ్లీ అటు , ఇటు తిప్పి తీస్తున్నాడని విమర్శలు కూడా చాలా వస్తున్నాయి .. ఇక దీంతో టాలీవుడ్ హీరోలే డేట్లు ఇవన్నీ పరిస్థితి వచ్చింది .. ఇక గతంలో పూరి సినిమాలతోనే సక్సెస్ అందుకున్న హీరోలు ఇప్పుడు ఆయన్ని దగ్గరికి కూడా రానివ్వటం లేదు .. ఇలాంటి సమయంలో పూరి , విజయ్ సేతుపతిని తన కథతో ఒప్పించాడు ? ఉన్నది మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారింది .. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే .