SSMB 29 : ఈ సినిమాను సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

frame SSMB 29 : ఈ సినిమాను సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali krishna
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు...సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొనగా అందులో మహేష్ కు సంబంధించిన ఓ వీడియో, ఫోటో రీసెంట్ గా లీకవడంతో చిత్ర యూనిట్ రూల్స్ మరింత కఠినం చేసింది... సెట్స్ లోకి ఒక్క ఫోన్ కనిపించిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా రాజమౌళి టీం చర్యలు తీసుకుంటుంది.

ఎప్పుడు లేని విధంగా రాజమౌళి స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.సినిమాను ఎలాగైనా సంవత్సరంన్నర లో పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాగైనా  టైమ్ పడుతుంది కాబట్టి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కీరవాణి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. కీరవాణి సినిమా గురించి ఎవరూ చెప్పని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసారు. కీరవాణి ‘నా టూర్ ఎంఎం కే’ అనే ఈవెంట్ ను మార్చి 22న నిర్వహించబోతున్నారు.

ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘ ‘ఎస్ఎస్ఎంబీ29’ లాంటి సినిమా ఇప్పటి వరకు ఎన్నడూ రాలేదు. ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్. ఇప్పటి వరకు నేను ఎన్నో సంచలన సినిమాలు చేశాను. కానీ దీనికి పనిచేయడం నాకు సవాల్ గా ఉంది. ప్రతి సినిమా ఎంతో ఇష్టంగా చేస్తాను.. కానీ ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు కాబట్టే కష్టంగా ఉంది’ అంటూ తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: