లారెన్స్ ప్లాన్ మామూలుగా లేదుగా .. ఈసారి ఏ గోస్ట్ కి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

frame లారెన్స్ ప్లాన్ మామూలుగా లేదుగా .. ఈసారి ఏ గోస్ట్ కి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ లో దెయ్యం సినిమా అంటే ముందు గా అందరికీ గుర్తుకొచ్చే పేరు కాంచన .. ఈ సినిమా ల‌తో అందరినీ ఎంతో భయపెట్టాడు రాఘవ లారెన్స్ .. అయితే ఇప్పుడు తాజా గా కాంచన ఫ్రాంచైజ్ లో ఇప్పుడు కొత్తగా కాంచన 4 రాబోతుంది .. అయితే ఈసారి హారర్ తో పాటు గ్లామర్ డోస్ కూడా మరింత పంచబోతున్నాడు లారెన్స్ .  ఇద్దరు భామలు ఈ సినిమాలో హీరోయిన్ల గా నటించబోతున్నారు . ఇప్పటి కే కాంచన సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ ఒక్కదాన్ని మించి మరొకటి హిట్ గా నిలిచాయి ..

ఇక ఇప్పుడు కాంచన 4 పై కూడా అంచనా లు అదే స్థాయి లో ఉన్నాయి .. అయితే ఈసారి సినిమా లో కత్తి లాంటి ఇద్దరు భామలను తీసుకోవటం కాంచన 4 కి మరింత హైప్ ని తీసుకొచ్చింది . ఇక కాంచన 4లో గ్లామర్ డోస్ ను పంచేందుకు బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ని లారెన్స్ ఓ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది .. అయితే ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే పూజ హెగ్డే నటిస్తుంది .. ఇద్దరు భామల తో కలిసి లారెన్స్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నాడట .

అయితే ఈ సినిమాలో పూజా  దెయ్యం గా మారి భయపెట్టబోతుందని టాక్ కూడా వినిపిస్తుంది .. అలాగే పూర్తి వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయి .. ఇదే జరిగితే ఈసారి లారెన్స్ తన బాడీ ని పూజా హెగ్డే కు అద్దెకు ఇస్తాడన్నమాట .. అయితే ప్రస్తుతం పూజా తమిళ్ ,  తెలుగు భాషల్లో వరుస‌ సినిమాలు చేస్తుంది .. అలాగే రజినీకాంత్ కూలి సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది .. కాంచన 4 తో లారెన్స్ ప్రేక్షకుల‌ను ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: