
చైతు - శోభితను కలిపింది ఇన్‌స్టాగ్రామా... మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇది.. !
వివాహానికి ముందు నాగచైతన్య, శోభిత ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా చాట్ చేసుకునే వారట.. అలా చాట్ చేసుకుంటూనే వీరి మధ్య పరిచయం పెరిగి , శోభితను నాగచైతన్య లంచ్ డేట్ కి ఆహ్వానించారట. అలా దీనికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ముంబైకి కూడా వెళ్లడం జరిగిందట నాగచైతన్య. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా గతంలో వైరల్ గా మారాయి.. కానీ వీరిద్దరూ అసలు ఇంస్టాగ్రామ్ లో ఎలా పరిచయమయ్యారు అనే విషయంపై శోభిత బయట పెట్టడం జరిగింది.
శోభిత, నాగచైతన్య ఎప్పుడు కూడా నేరుగా మాట్లాడలేదట.. అలా మాట్లాడకుండానే ఇంస్టాగ్రామ్ లో ఆమెన్ ఫాలో కొట్టాడట. శోభిత కూడా తనని ఫాలో అవుతుందని అనుకున్న చైతూకి... ఆమె షాక్ ఇచ్చింది. అసలు శోభిత నాగచైతన్యను ఫాలో అవ్వలేదట.. కానీ ఒకసారి సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఒక నెటిజన్ నాగచైతన్యాన్ని ఎందుకు ఫాలో అవ్వడం లేదని ప్రశ్నించారట.. ఆ తర్వాత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేస్తే నిజంగానే చైతన్యని ఫాలో అవలేదనే విషయాన్ని గ్రహించి, వెంటనే అతనిని ఫాలో అవ్వడం మొదలు పెట్టిందట శోభిత.
అలా శోభిత రిప్లై కోసం వెయిట్ చేసిన నాగచైతన్య ఆ తర్వాత ఆమెతో చాట్ చేసుకుంటూ మాట్లాడకుంటూనే చివరికి ప్రేమలో పడ్డారట.. అలా ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లారు నాగచైతన్య.. నిజానికి శోభితాకు రెండవ పెళ్లి చేసుకునే వ్యక్తిని ఉద్దేశం లేకపోయినప్పటికీ.. నాగచైతన్య వచ్చిన తర్వాత తన జీవితం చాలా మారిందని అందుకే వివాహానికి ఒప్పుకున్నానని తెలిపిందట.