
ఆమెతో భయంకరమైన ట్విస్టు లు ప్లాన్ చేసిన జక్కన్న.. SSMB 29 నుంచి క్రేజీ న్యూస్..!
రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .. బాహుబలి సినిమాల్లో భల్లాలదేవ , మగధీరలో షేర్ ఖాన్ లాంటి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .. ఇక ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమాల్లో కూడా ఎంతో శక్తివంతమైన విలన్ పాత్రను చూపించాలని రాజమౌళి భావిస్తున్నార .. ఈ క్రమంలోనే గ్లోబల్ బ్యూటీ అయిన ప్రియాంకను విలన్ పాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం . సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ తోనే అసలైన ఊహించని భయంకరమైన ట్విస్ట్ కూడా ఉంటుందని ఓ టాక్ . అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా లోని అడవుల్లో జరుగుతుంది .. అయితే ఈ సెట్స్ నుంచి ఎలాంటి ఫోటోలు , వీడియోలు బయటికి రాకుండా గట్టి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ..
రీసెంట్గా ఈ సినిమా నుంచి కొన్ని లీకులు బయటకు రావడంతో టీం మరింత కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది . అయితే ఇందులో ప్రియాంక నిజంగా విలన్ గా నటించబోతున్నారా అనే విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది . అయితే ప్రియాంక గతంలో కూడా ఇప్పుడు ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ లో నటించలేదు .. కానీ ఇప్పుడు ఒక ఫుల్ లెన్త్ నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం మాత్రం ఆమెకు కొత్తగా మారింది .. బాలీవుడ్ లో ప్రధానంగా గ్లామర్ పాత్రలోనే నటించిన ఈమె ఓ ఇంటర్నేషనల్ విలన్ గా మారితే సినిమా స్థాయి మరో రేంజ్కి వెళ్లడం కూడా ఖాయం .. అయితే ఇప్పుడు ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే రాజమౌళి నుంచి అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి ..