మరో గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు ..? అసలు ఎవరు ఊహించలేదుగా ..!

frame మరో గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు ..? అసలు ఎవరు ఊహించలేదుగా ..!

Amruth kumar
త్రిబుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా వచ్చిన మూవీ గేమ్ చేంజర్ .. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలింది .. మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విడిచారు .. అసలు బాలేదని అభిమానులు కూడా విమర్శలు చేశారు .. సరైన కథతో సినిమాను తెరకెక్కించడం లో శంకర్ ఘోరంగా ఫేయిల్ అయ్యార‌నే మాటలు కూడా వచ్చాయి . అలాగే ఈ సినిమా కలెక్షన్ విషయంలో కూడా పెద్ద చర్చ నడిచింది .. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ప్రకటించిన కలెక్షన్లకు వంద కోట్లకు పైగా తేడానే కనిపించింది ..

దీంతో గేమ్ చేంజర్ కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది .. దీంలో కలెక్షన్ల విషయంలో బాగా ట్రోల్స్ రావడం తో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గారు .  రెండో రోజు కలెక్షన్లు కూడా ప్రకటించడం ఆపేశారు .. ఇలా మొత్తంగా రామ్ చరణ్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది గేమ్ చేంజర్ .. అయితే చరణ్ ప్రస్తుతం ఉప్పెన‌ దర్శకుడు బుచ్చిబాబు తో తన తర్వాత సినిమా చేస్తున్నాడు . ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంట‌గా జాన్వీ  కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .  ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎంతో స్పీడ్ గా జరుగుతుంది .. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెర్కక్కిస్తున్నారు ..

అయితే ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఓ చిన్న ప్రత్యేక పాత్రలో నటిస్తుందని ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది .. చరణ్ కొత్త సినిమా షూటింగ్లో ఉపాసన ఊహించ‌ని విధంగా ప్రత్యక్షమైంది .. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇక దీంతో ఉపాసన ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నార‌నే ప్రచారం మరింత గట్టిగా వినిపిస్తుంది .. ఉపాసన ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించినట్లయితే  RC16 కచ్చితంగా హిట్ అవ్వటం ఖాయమంటున్నారు మెగా అభిమానులు .. ప్రజంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: