రాబిన్ హుడ్ బడ్జెట్ అన్ని కోట్లా.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అంతే.. నిర్మాతలు డేంజర్ జోన్ లో ఉన్నారా..?

frame రాబిన్ హుడ్ బడ్జెట్ అన్ని కోట్లా.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అంతే.. నిర్మాతలు డేంజర్ జోన్ లో ఉన్నారా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈయన జయం అనే మూవీ తో కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించిన నితిన్ ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

కొంత కాలం క్రితం ఈయన మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుమల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే మైత్రి సంస్థ వారు ఈ సినిమా నిర్మించడం కోసం మరియు పబ్లిసిటీతో కలిపి దాదాపు 65 నుండి 70 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మైత్రి సంస్థ వారు భారీ ఖర్చు చేసిన ఈ మూవీ కి థియేటర్ హక్కుల ద్వారా కేవలం 30 కోట్ల వరకు మాత్రమే డబ్బులు వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ద్వారా నిర్మాతలు లాభాలను పొందాలి అంటే దాదాపు మరో 35 నుండి 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను జరుపుకోవాలని ఉంది. ఈ మూవీ కి మ్యూజిక్ , సాటిలైట్ , డిజిటల్ హక్కుల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ సినిమా కనుక అద్భుతమైన విజయం సాధిస్తే డబ్బింగ్ హక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని రకాల ద్వారా ఈ సినిమా మరో 35 నుండి 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లయితే ఈ మూవీ ద్వారా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: