
రాజశేఖర్- సుమన్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?
హీరో రాజశేఖర్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా సినిమాల పైన ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ వైపుగా అడుగులు వేశారు. మొదట్లో ఒకటి రెండు చిత్రాలలో నెగటివ్ సేడ్స్ ఉన్న పాత్రలలో నటించిన ఆ తర్వాత హీరోగా మారి పేరు సంపాదించారు. సుమన్ కూడా హీరోగా ఎదిగి చిరంజీవి వంటి హీరోలకే డామినేట్ చేసే స్థాయికి ఎదిగారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల , ఇబ్బందుల వల్ల కెరియర్ ఒకసారిగా డౌన్ అయిపోయింది.
ముఖ్యంగా హీరో సుమన్ ,రాజశేఖర్ ఇద్దరూ కూడా సినిమాలలో వాడేది తమ సొంత వాయిస్ కాదు.. ఇతరులు చెప్పేవారట డబ్బింగ్ హీరో ఎవరో కాదు సాయికుమార్. ఇద్దరు హీరోలకు అప్పట్లో సాయికుమార్ ఎక్కువగా డబ్బింగ్ చెప్పే వారట. అయితే వీరిద్దరూ హీరోలుగా రాణిస్తున్న సమయంలో వీరిద్దరి వాయిస్ ఒకేలాగా ఉందని చాలామంది ఫీల్ అయ్యేవారట. ఈ ఎఫెక్ట్ వారి యొక్క సినీ కెరియర్ మీద కూడా పడిందని సమాచారం. ఇదే అటు రాజశేఖర్, సుమన్ మధ్య గొడవకి దారి తీసింది. దీంతో ఇద్దరు కలిసి హీరో సాయికుమార్ కి వార్నింగ్ ఇచ్చారట.. ఇద్దరిలో ఎవరో ఒకరికి డంపింగ్ చెప్పాలని ఇద్దరికీ చెప్పకూడదని పెద్ద చిక్కు తెచ్చిపెట్టారట.. అలాంటి సమయంలోను సాయికుమార్ ఒక ప్లాన్ వేసి వాయిస్ లలో డిఫరెంట్ క్రియేట్ చేసేలా చేశారట. హీరో రాజశేఖర్ కి ఆవేశంగా డబ్బింగ్ చెప్పే వాయిస్ అలాగే సుమన్ కి కాస్త నెమ్మదిగా డబ్బింగ్ చెప్పే వాయిస్ ని మొదలుపెట్టారట. అలా ఇద్దరినీ కూడా సాయికుమార్ బ్యాలెన్స్ చేశారు.