
తెలుగులో ఆఫర్లు వస్తున్నా .. సీత మనసంతా అక్కడే ఉందిగా..!
ఇక తర్వాత హాయ్ నాన్న తో తెలుగులో సెటిలయ్యే భారీ ఛాన్స్ కూడా వచ్చింది .. తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా తో నిరాశ పరిచిన మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో మంచి ఆఫర్లే వస్తున్నాయి . కానీ ఈ బ్యూటీ మాత్రం సౌత్ ను ఆసలు పట్టించుకోవడం లేదు .. ఏదో అనుకోకుండా రెండు సినిమాలు చేశారేమో అనిపిస్తుంది .. పద్ధతి కూడా అలానే ఉంది .. బాలీవుడ్ పై ఉన్న ప్రేమతో ఈ మధ్య ఫోటోషూట్స్లో మరింత గ్లామర్ డోస్ పెంచేశారు మృణాల్. బాలీవుడ్లో సంజయ్ లీల బన్సాలి ప్రొడక్షన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు సన్ ఆఫ్ సర్దార్ 2 లో కూడా మృణాల్ నటిస్తుంది .. మరో రెండు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. అయితే తెలుగులో ప్రస్తుతం అడివి శేష్‌తో డెకాయిట్‌లో మాత్రమే నటిస్తున్నారు ఈ హీరోయిన్ .. ఇలా మొత్తానికి సౌత్ లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా .. ఇస్తామని చెప్పినా మృణాల్ మనసు మాత్రం ముంబైలోనే ఉంది.\