బోర్డర్స్ దాటేస్తున్న తెలుగు దర్శకులు .. ఇండస్ట్రీపై ప్రభావం ఉంటుందా..?

frame బోర్డర్స్ దాటేస్తున్న తెలుగు దర్శకులు .. ఇండస్ట్రీపై ప్రభావం ఉంటుందా..?

Amruth kumar
ఇప్పటివరకు మన దర్శకులు పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటిన .. ఆ సినిమాలన్నీ తెలుగు నేటివిటీతోనే చేశారు .. రాజమౌళి బాహుబలి, సుకుమార్ పుష్ప, నాగి కల్కి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ నటించిన బాలీవుడ్ లో భారీ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిన .. ఈ సినిమాలన్నీ తెలుగు హీరోలతోనే మన తెలుగు నిర్మాతలతో చేసినవే .. ఇప్పటివరకు ఇదే ఫార్ములాకు కట్టుబడిన‌ దర్శకులు ఇప్పుడు ఆ గీత దాటుతున్నారు .. మన హీరోలను కాదని ఇతర భాష హీరోల వైపు ముగ్గు చూపుతున్నారు . పుష్పా సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సుకుమార్ .. ఇప్పుడు నార్త్ వైపు చూస్తున్నారన్న టాక్ కూడా నడుస్తుంది .  అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో సుకుమార్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్నది నార్త్ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్త ..

ఇంకా అధికార ప్రక‌ట‌న‌ లేకపోయినా ప్రస్తుతం సుకుమార్ కు ఉన్న క్రేజ్‌ చూస్తే ఏ బాలీవుడ్ హీరో అయినా ఈ లెక్కల మాస్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పేస్తారు . అలాగే తెలుగులో వ‌రున‌ ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు కోలీవుడ్ వైపు చూస్తున్నారు .. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో యాక్షన్ ఎంటర్టైనర్ను తీసుకురానున్నారు పూరి .. ఇక ఈ సినిమా బైలింగ్యువల్ ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు .. విజయ్ సేతుపతి ప్రధాన మార్కెట్ కోలీవుడ్ డే కాబట్టి మేజర్ ఫోకస్ కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది . తెలుగు సినిమాతో వెండి తెర‌పై ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పూర్తిస్థాయిగా బాలీవుడ్ డైరెక్టర్ గా మారిపోయాడు .. తన రెండో సినిమానే హిందీలో చేసి సందీప్ అక్కడే సెటిలైపోయాడు .. వరుసగా టి సిరీస్ బ్యానర్ లోని సినిమాలు చేస్తూ  నార్త్ లో తన మార్క్ చూపిస్తున్నాడు .. మాస్ యాక్షన్ సినిమాలకు స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేనికూడా బాలీవుడ్లో అడుగుపెట్టాడు ..

గాదర్ 2 తో బౌన్స్ బ్యాక్ అయినా సన్నీ డియల్ హీరోగా జాట్ సినిమాను చేస్తున్నాడు గోపీచంద్ . మరో యంగ్‌ డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసగా ఇతర భాష హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు .. ఇప్పటికే సార్ , లక్కీ భాస్కర్ లాంటి వరుస విజయాలు ఇచ్చిన వెంకీ ఇప్పుడు సూర్యతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .. పక్క తెలుగు నేటివిటీ కథలతో సినిమాలు తెర‌క‌కెక్కించే శేఖర్‌ కమ్ముల కూడా కాస్త తన గీత దాటి ధనుష్ హీరోగా కుబేర సినిమా చేస్తున్నారు .. గౌతమ్‌ తిన్ననూరి, శైలేష్ కొలను లాంటి యంగ్ దర్శకులు కూడా బాలీవుడ్లో తమ మార్కు చూపించే ప్రయత్నంలో ఉన్నారు .. మన దర్శకులంతా ఇత‌ర ఇండస్ట్రీలో సత్తా చాటాలన్నీ చూడటంతో ఇతర భాష దర్శ‌కులు మన హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: