దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29”..ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.. పైగా మొదటి సారి మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్ కి చేరాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి షూటింగ్ సెట్ లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు.. కానీ ఎలా లీక్ అయిందో తెలీదు కానీ ఈ సినిమాలో చిన్న క్లిపింగ్ రీసెంట్ గా లీక్ అయింది. లీక్ అయిన క్లిపింగ్ క్షణాల్లో వైరల్ అయింది.. వెంటనే అప్రమత్తం అయిన టీం ఆ క్లిపింగ్ ని డిలీట్ చేసింది.. దీనితో ఈ సారి రాజమౌళి రూల్స్ మరింత కఠినం చేసారు..
కానీ రాజమౌళి కి ఈ లీక్స్ వల్ల కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ సినిమాకు సంబంధించి లీకులు ఆగట్లేదు. కానీ తాజాగా అదే ఒడిశా సెట్స్ నుంచి మరో ఫొటో లీక్ అయిపోయింది.ఇందులో మహేవ్ బాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బ్యాక్ నుంచి తీసిన ఈ ఫొటోలో మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నేటితో ఒడిశా షెడ్యూల్ పూర్తి అయింది. చివరి రోజు ఇలా లీక్ కావడంతో.. ఇది చూసిన వారంతా అసలు ఎందుకు లీక్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు..
రాజమౌళి సినిమా అంటే లీక్స్ ఉండవని అందరికీ తెలుసు..ఎందుకంటే ఏదైనా లీక్ ఇస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే సంగతి ఆయనకు బాగా తెలుసు..అందుకే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా బయటకు చూపించలేదు. ఒక్క పాత్ర గురించి కూడా ప్రకటించట్లేదు.. కానీ ఇలాంటి లీక్స్ పై రాజమౌళి ప్రత్యేక దృష్టి పెట్టాలి.. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి