నిహారిక నిర్మాతగా రెండు మూవీ .. డైరెక్టర్ ఎవరంటే ..?

frame నిహారిక నిర్మాతగా రెండు మూవీ .. డైరెక్టర్ ఎవరంటే ..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
మెగా కుటుంబం నుంచి మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు నిహారిక కొణిదల ఆ తర్వాత పలు సినిమా ల్లో నటించి ఆ తర్వాత వెబ్ సిరీస్ లు కూడా చేసింది .. మధ్య లో పెళ్లి తర్వాత సినిమాల కు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ పెళ్లయిన కొన్ని సంవత్సరాలకి భర్త తో విడాకులు తీసుకుని మరోసారి న‌టి గా కాకుండా ఈసారి నిర్మాత గా బిజీ అయింది .. విడాకుల తర్వాత నిర్మాత గా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా తో భారీ విజయాన్ని అందుకుంది .. అంతా కొత్తవారి తో నిర్మించిన ఈ చిన్న సినిమా కు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది .. కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి .. అయితే ఇప్పుడు రెండో సినిమా నిర్మించడాని కి సన్నాహాలు చేస్తుంది ఈ మెగా కూతురు .


ఇక  తన ప్రాజెక్టు ల‌తో చిల‌కాలం గా అసోసియేట్ అయి ఉన్న మానస శర్మ కు అవకాశం ఇస్తున్నారు .. ఆమె దర్శకత్వం లో రెండో సినిమా ని త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు . ఇక  మానస శర్మ గతం లో నిహారిక దగ్గరే క్రియేటివ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ వస్తున్నారు .. ఒక చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్ , బెంచ్ లైప్ సిరీస్ చేశారు .  సినిమాలు డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి .  అలాగే కమిటీ కుర్రోళ్ళు సినిమా మేకింగ్ విషయం లో ప్రాజెక్టు ను లాంచ్ చేసే విషయం లోను నిహారిక చాలా చురుగ్గా ఎంతో తెలివి గా వ్యవహరించారు .. అలాగే తన పరిచయాల ని ఉపయోగించి సినిమా కు మంచి పబ్లిసిటీ కూడా చేసుకున్నారు .. ఇక ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ కు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: