టీజర్ ఎఫెక్ట్ తో కళ్యాణ్ రామ్ సినిమాకి భారీ బిజినెస్ .. గట్టిగానే గురిపెట్టాడుగా..!

frame టీజర్ ఎఫెక్ట్ తో కళ్యాణ్ రామ్ సినిమాకి భారీ బిజినెస్ .. గట్టిగానే గురిపెట్టాడుగా..!

Amruth kumar

ఒక సినిమాకు సంబంధించిన బిజినెస్ ఆ సినిమా సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది అని క్లారిటీ గా చెప్పవచ్చు .. ఇక కొన్ని సినిమాల కి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మొదలైతే మరికొన్ని సినిమాల కి అది టీజర్ వరకు వెళుతుందని కూడా చెప్పవచ్చు .. అయితే ఇప్పుడు తాజా గా టీజర్ తో గట్టి బిసినెస్ ని అందుకున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి .. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరో గా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ విజయశాంతి పవర్ఫుల్ పాత్ర లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. అయితే ఈ టీజర్ సినిమా కి మంచి బూస్ట్ ఇచ్చినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి ..

టీజర్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ రామ్ సినిమాను కొనేందుకు బయ్యర్లు  ఎంతో ఆసక్తి చూపిస్తున్నారట .. అలాగే ఆంధ్రాలో 12 కోట్ల కు పైగా బిజినెస్ చేస్తే సీడెడ్  నుంచి ఏకంగా 3.7 కోట్ల బిజినెస్ ఈ సినిమా కు వచ్చిందట .. అదే విధంగా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా ఈ సినిమా కి అమ్ముడుపోయాయట .. ఇలా మొత్తాని కి నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ బిజినెస్ చేసినట్లు గా తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా కి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించ గా ఈ సినిమాని ఈ సమ్మర్ రేస్ లో మెక‌ర్స్‌రిలీజ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది .. జూన్ మొదటి వారంలో లేదా మే సెకండ్ వీక్ లో ఈ సినిమా ను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి . ఇక మరి ఈ సినిమా తో కళ్యాణ్‌రామ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: