సుబ్బు పాత్రకు నవీన్, డీజే టిల్లు సెట్ అవుతారు: నాగ్ అశ్విన్

frame సుబ్బు పాత్రకు నవీన్, డీజే టిల్లు సెట్ అవుతారు: నాగ్ అశ్విన్

MADDIBOINA AJAY KUMAR
ఎవడే సుబ్రమణ్యం సినిమా చూడని వారుండారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమాకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.  ఆ టైమ్ లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటే ఇదిరా అనిపించేలా ఉన్న సినిమా ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోలుగా న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా మాళవిక, రీతూ వర్మ నటించారు. ఈ సినిమాకు అందాల రాక్షసి ఫేమ్ రాధన్ సంగీతం అందించాడు.


ఆ రోజుల్లోనే థియేటర్లలో ఈ సినిమా మంచిగా ఆడింది. ఈ మూవీ మంచి టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాత్రలకు నాని, మాళవిక, విజయ్ దేవరకొండ ప్రాణం పొసరనే చెప్పాలి. వీరి నటన మాత్రం చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నాని సుబ్రమణ్యం పాత్ర పోషించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని తనని తాను అన్వేషించుకోవడానికి చేసిన ఓ ప్రయణమే ఈ సినిమా. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.


అయితే ఈ సూపర్ సినిమా వచ్చి పదేళ్ల అవుతుంది. ఈ సినిమా మరోసారి థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ నెల 21న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఇటీవలే నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒక విలేకర్ ఎవడే సుబ్రమణ్యం సినిమాలోని సుబ్బు, రిషి పాత్రలకు వేరే హీరోలు ఎవరు సూట్ అవుతారని నాగ్ అశ్విన్ ని అడిగారు. దానికి ఆయన మాట్లాడుతూ.. 'నాని సుబ్రమణ్యం పాత్రకు నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ సెట్ అవుతారు. కానీ రిషి పాత్రకు ఎవరు సెట్ అవుతారని చెప్పడం కష్టం' అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: