లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక ఈ హీరోయిన్ సినిమాలతోపాటు పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది . పెళ్ళయ్యాక కూడా చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ధనుష్ మూవీకి సంబంధించి ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ధనుష్ నిర్మాతగా చేసిన నానుం రౌడీ ధాన్ అనే సినిమాలో ఆయన పర్మిషన్ లేకుండానే ఆ సినిమాలోని చిన్న క్లిప్ ని తన డాక్యుమెంటరీ కోసం నయనతార వాడుకోవడంతో ఈ వివాదం తలెత్తింది.ఈ విషయం పక్కన పెడితే.. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరో ఒక డైరెక్టర్ దగ్గర హీరో దగ్గర నిర్మాత దగ్గర అవమానాలు పడినవారే.
అలా నయనతార కూడా ఓ డైరెక్టర్ కం హీరో దగ్గర అవమాన పడిందట.మరి ఇంతకీ నయనతారని అవమానించిన ఆ నటుడు ఎవరయ్యా అంటే తమిళ నటుడు నిర్మాత డైరెక్టర్ అయినటువంటి పార్థిబన్.. నయనతార ఫస్ట్ మూవీ పార్థబన్ తో రావాల్సి ఉందట. అయితే పార్థిబన్ నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొన్న నయనతార సెలెక్ట్ అవ్వడంతో షూటింగ్ స్పాట్ కి వచ్చేయమని నయనతారకి ఫోన్ కాల్ వచ్చిందట. అయితే ఈ విషయం వినడంతోనే నయనతార చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే షూటింగ్ స్పాట్ కి వెళ్దామని రెడీ అవుతుండగా తన వ్యక్తిగత కారణాలవల్ల షూటింగ్ స్పాట్ కి కాస్త ఆలస్యంగా వెళ్ళిందట.
అయితే అప్పటికే గుర్రు మీదున్న పార్థిబన్ ఇప్పుడు ఎందుకు వచ్చావు..ఇకపై ఈ సినిమాకి నీ అవసరం లేదు. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అంటూ అందరి ముందే నయనతారపై అరిచారట.అయితే నయనతార అందరి ముందే తనని అవమానించడంతో చాలా అవమానంగా ఫీల్ అయిందట. ఇక ఈ విషయం గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. నన్ను పార్థబన్ తిట్టినందుకు నేను ఫీల్ అవ్వలేదు.కానీ ఆయన నన్ను అంత మందిలో అనేసరికి చాలా బాధనిపించింది అంటూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు జరిగిన అవమానం గురించి నయనతార చెప్పుకొచ్చింది.