బీటౌన్ లో ఎక్కడ చూసినా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.. అయితే అమీర్ ఖాన్ తన బర్త్డే సందర్భంగా గౌరీ స్ప్రాట్ ని మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్, గౌరీల గురించి ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోవడం కూతురు ఐరా ఖాన్ కి అస్సలు ఇష్టం లేదు అంటూ బీటౌన్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దానికి ప్రధాన కారణం కూతురు ఐరా ఖాన్ ప్రవర్తించిన తీరే.. అమీర్ ఖాన్ బర్త్డే వేడుకల్లో ఐరా ఖాన్ కూడా కనిపించింది. అయితే ఎప్పుడైతే అమీర్ ఖాన్ తాను గౌరీ స్ప్రాట్ తో గత 18 నెలల నుండి డేటింగ్ లో ఉన్నాను అనే విషయం బయట పెట్టాడో ఆ టైంలో ఐరా ఖాన్ మొహం మొత్తం ఛేంజ్ అయిపోయింది.
అంతేకాదు తన తండ్రి అమీర్ ఖాన్ తో ఐరా ఖాన్ ఏదో గొడవ పెట్టుకునట్టు కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆ టైంలో అమీర్ ఖాన్ ఐరా ఖాన్ కి సర్ది చెప్పినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇక ఈ వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోవడం ఐరా ఖాన్ కి ఇష్టం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తాజాగా ఐరా ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా అనుమానాలు పెంచే ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే..తన ఫోన్ బ్రౌజర్ లో ఎన్నో ట్యాబ్లు ఓపెన్ చేసి ఉన్న ఫోటోని షేర్ చేసుకోవడంతో పాటు ఆ ఫోటో కింద నీ మైండ్ లో ఏం జరుగుతుందో?అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
అయితే ప్రస్తుతం ఐరా ఖాన్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు తండ్రిని ఉద్దేశించే ఐరా ఖాన్ ఈ పోస్ట్ పెట్టిందని, తండ్రి గౌరీతో రిలేషన్ లో ఉండడం బహుశా ఐరా ఖాన్ కి నచ్చలేదు కావచ్చు.అందుకే అసహనంతో కోపంతో ఇలాంటి పోస్ట్ పెట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెప్పారు.కానీ అమీర్ ఖాన్ మాత్రం నా పిల్లలకు నేను గౌరీ తో కలిసి ఉండటం ఇష్టమే.వాళ్లు కూడా గౌరీతో ప్రేమగా మాట్లాడారు అంటూ చెప్పుకొచ్చాడు